నిండు కుండలా ప్రకాశం బ్యారేజ్‌

Prakasam Barriage Full Filled With Cyclone Pethai Rains - Sakshi

12 అడుగులకు నీటి మట్టం

మూడు గేట్ల ద్వారా 2,175 క్యూసెక్కులు విడుదల

కాల్వలకు వరద నీరు వదలని అధికారులు

నదీ తీరవాసులు అప్రమత్తంగా ఉండాలి:  కలెక్టర్‌

సాక్షి, విజయవాడ :  పెథాయ్‌ తుఫాను వల్ల కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజ్‌ నిండుకుండలాగా మారింది. పై నుంచి వచ్చి చేరే వరద నీటితో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద గరిష్ట స్థాయికి చేరిం ది. దీంతో సోమవారం రాత్రి ప్రకాశం బ్యారేజ్‌ నుంచి క్రిందకు వరద నీటిని విడుదల చేయనున్నారు. వైరా, కట్టలేరు, మున్నేరు నుంచి కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

కాల్వలకు నీరు బంద్‌
జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తు ఉండటంతో ఇప్పటికే అనేక పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఈ దశలో కాల్వలకు నీరు వదిలితే   కాల్వల కట్టలు తెగిపోతాయని ఉద్దేశ్యంతో      కాల్వలకునీరు వదిలి వేయడం నిలిపివేశారు.

2,175 క్యూసెక్కులు సముద్రంలోకి!
కృష్ణానదిలో నీటి మట్టం గరిష్టంగా 12 అడుగులకు చేరింది. అప్పటికీపై నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. దీంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో మూడు గేట్ల ను ఒక అడుగు ఎత్తి 2,175 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 5 నుంచి ఏడు వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలా లని అధికారులు భావించారు. అయితే పై నుంచి వచ్చే వరద నీటి ఉధృతిని బట్టి మంగళవారం ఉదయం గేట్లు సంఖ్య పెంచవచ్చని భావించిన తొలుత 3 గేట్లు మాత్రమే పైకి తీసినట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.

లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం
సముద్రంలోకి వరద నీటిని వదులుతున్నందున నదీ తీరప్రాంతాల్లో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ లక్ష్మీకాంతం హెచ్చరించారు. విజయవాడ, పెనమలూరు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, తహసీల్దార్లు ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు నదిపరీవాహక ప్రాంతాల్లో దండోరా వేయించారు. నదిలోకి వెళ్లవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా పెథాయ్‌ తుఫాను తీరం దాటడంతో మంగళవారం వర్షాలు తగ్గుతగ్గి వాతావరణం మార్పులు వస్తాయని భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top