హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం పోర్టుల (నౌకాశ్రయాలు) నుంచి విరాళాలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం పోర్టుల (నౌకాశ్రయాలు) నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. సీఎం రిలీఫ్ ఫంఢ్కు కృష్ణపట్నం పోర్టు రూ.5 కోట్లు, విశాఖపట్నం పోర్టు రూ.60 లక్షలు, కాకినాడ పోర్టు రూ. కోటి, గంగవరం పోర్టు రూ.కోటి విరాళం ప్రకటించాయి.
మరోవైపు హుదూద్ తుఫానుకు నష్టపోయిన నాలుగు జిల్లాల బాధితుల కోసం పది రకాల నిత్యావసరాలు, కిరోసిన్కు సరఫరా చేసేందుకు ప్రభుత్వం జీఓ నం.88 విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని సుమారు ఐదు లక్షల బాధిత కుటుంబాలకు ఈ సరుకులు అందించనున్నారు.