
హరినాథ్
పలమనేరు: అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు ఓ గ్రామీణ యువకుడు. తల్లిదండ్రుల కష్టాలను చూసి కష్టపడి చదివి ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. పలమనేరులోని పెద్దపంజాణి మండలం గోనుమాకులపల్లికి చెందిన వెంకటేష్, ముత్యాలమ్మల కుమారుడు తోటి హరినాథ్ గత ఏడాది ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.
అనంతపురంలోని పోలీసు శిక్షణకేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకుని రెండ్రోజుల క్రితం ఉపముఖ్యమంత్రి నుంచి నియామక పత్రం అందుకున్నారు. గురువారం గ్రామానికి చేరుకున్న అతనికి గ్రామస్తుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. హరినాథ్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి తన తల్లే కారణమన్నాడు. కూలిపనులు చేసి తనను చదివించిందన్నారు. ఆమె ఆశయాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా తాను కష్టపడ్డానన్నారు. ప్రజలకు ఉత్తమ సేవలను అందించి బాధితులకు న్యాయం జరిగేలా కృషిచేస్తానని హరినాథ్ పేర్కొన్నాడు.