నిలువ నీడ లేని ఆడ బిడ్డ..

Poor Woman Did Not Get Home From NTR Housing Scheme In Krishna District - Sakshi

ఈమె పేరు కొప్పుల నాగమణి.
స్వగ్రామం కృష్ణా జిల్లా చోడవరం.
కొన్నేళ్ల కిందట భర్త చనిపోయాడు.
పెళ్లిళ్లలో వంట చేస్తూ ఉపాధి పొందుతోంది. ఎక్కడికెళ్లినా... దివ్యాంగురాలైన కూతురిని తనతోపాటు తీసుకెళ్తూ కంటికి రెప్పలా చూసుకుంటోంది. సొంత ఇల్లు లేని నాగమణికి... ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన ఎన్టీఆర్‌ హౌసింగ్‌ పథకంలోనైనా పక్కా గృహం వస్తుందని ఆశిస్తే నిరాశే మిగిలింది. అధికార పార్టీ స్థానిక నాయకులను కలిసినా ఫలితం లేకపోయిందని వాపోతోంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని అధికారులను వేడుకుంటే, పునాది వేశాకే డబ్బు మంజూరు చేస్తామంటున్నారు. ఆ స్థాయి స్థోమత కూడా లేని నాగమణి ఇదుగో ఇలా స్థలం చుట్టూ పాక వేసుకుని, ఇంటికి రక్షణగా ఫ్లెక్సీలను ఉంచి జీవనం వెళ్లదీస్తోంది.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top