పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్ | Police Mark Treatment in khammam district | Sakshi
Sakshi News home page

పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్

Dec 13 2013 4:35 AM | Updated on Aug 21 2018 7:26 PM

ఖమ్మం అర్బన్ పోలీసులు రెచ్చిపోయారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీస్‌మార్క్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు.

ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్:  ఖమ్మం అర్బన్ పోలీసులు రెచ్చిపోయారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీస్‌మార్క్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. ఇది చాలదన్నట్లు హత్య కేసులో నిందితుల మాదిరిగా నడిరోడ్డుపై గొలుసులతో భారీ బందోబస్తు మధ్య ప్రదాన రహదారిపై ప్రదర్శనగా కోర్టుకు తీసుకెళ్లారు. వివరాలిలా ఉన్నాయి.
 
 గతనెలలో ఖానాపురం హవేలీ పరిధిలో శ్రీనగర్‌కాలనీలో ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తున్న యువకులను స్థానికులు మందలించారు. దీంతో యువకులు, స్థానికుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. అనంతరం ఇద్దరు యువకులు వారి స్నేహితులతో కలిసి వచ్చి స్థానికులపై దాడి చేయడంతో స్థానికులు సైతం వారిపై దాడి చేశారు. అనంతరం స్థానికులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
 
 నిందితులుగా ఉన్న మరో ఇద్దరు యువకులు నేరుగా కోర్టులో లొంగిపోయారు. పోలీసులు వీరిని విచారణ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి పోలీస్‌మార్క్ ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా రెచ్చిపోయి గురువారం ఆ యువకులను గొలుసులతో బంధించి సినీఫక్కీలో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. పోలీసుల తీరును చూసిన స్థానికులు అవాక్కయ్యారు. తీవ్రమైన కేసుల్లో మాత్రమే ఇలా వ్యవహరించే పోలీసులు చిన్నపాటి ఘర్షణ కేసులో నిందితులైన ఇద్దరు యువకుల పట్ల ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 బహిరంగ విచారణ కోసం...
 ఖమ్మం అర్బన్ : శ్రీనగర్ కాలనీలో గత నెల 20వ తేదీన జరిగిన ఘర్షణలో బహిరంగ విచారణ కోసం జైల్లో ఉన్న ప్రవీణ్, ఆరీఫ్‌లను కస్టడీలోకి తీసుకున్నామని ఖమ్మం అర్బన్ పోలీసులు తెలిపారు. వారిని గురువారం శ్రీనగర్ కాలనీలోని నారాయణరావు ఇంటి పరిసరాలకు తీసుకెళ్లి విచారణ చేశామని అన్నారు. అనంతరం వారిని తిరిగి కోర్టుకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ కేసులో కొందరు  పోలీసుల ముందు వచ్చినప్పటికీ వివరాలు చెప్పడానికి నిరాకరించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement