విజయవాడలో పెరుగుతున్న గన్ కల్చర్ | police found gun in dust bin | Sakshi
Sakshi News home page

విజయవాడలో పెరుగుతున్న గన్ కల్చర్

Dec 7 2014 1:52 PM | Updated on Aug 24 2018 2:36 PM

విజయవాడలో పెరుగుతున్న గన్ కల్చర్ - Sakshi

విజయవాడలో పెరుగుతున్న గన్ కల్చర్

విజయవాడ నగరంలో గన్ కల్చర్ క్రమేపీ పెరుగుతోంది.

విజయవాడ: నగరంలో గన్ కల్చర్ క్రమేపీ పెరుగుతోంది. ఆదివారం ఓ చెత్తకుప్పలో గన్ దొరకడంతో కాస్తా విజయవాడ వాసుల్ని మరింత కలవరానికి గురి చేస్తోంది. 13 వ డివిజన్ రెవిన్యూ కాలనీ లో గన్ లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ గన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  అసలు ఈ గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై పోలీసులు ఆరా తీసే పనిలో పడ్డారు.

 

వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా ఉత్తరప్రదేశ్,  బీహార్ రాష్ట్రాల నుంచి ఆంధ్రాకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు  ముమ్మరం చేశారు. గత నెల్లో ఇదే తరహాలో గుంటూరు జిల్లాలో  హేమంత్ అనే యువకుడు వద్ద తుపాకీ దొరికిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement