పోలీస్‌ కన్వెన్షన్‌ హాలు ప్రారంభం | police convection hall opened | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కన్వెన్షన్‌ హాలు ప్రారంభం

Jul 21 2016 1:18 AM | Updated on Aug 21 2018 5:54 PM

పోలీస్‌ కన్వెన్షన్‌ హాలు ప్రారంభం - Sakshi

పోలీస్‌ కన్వెన్షన్‌ హాలు ప్రారంభం

కాకినాడలోని పోలీసు రిజర్వులైనులో రూ.1.35 కోట్లతో నిర్మించిన కన్వెన్షన్‌ హాలును బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.

కాకినాడ రూరల్‌ : పోలీసులు తమ పరిధిలోని కమ్యూనిటీ , కన్వెన్షన్‌ హాళ్ల వంటి వాటిని ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకోవాలని డీజీపీ జేవీ రాముడు సూచించారు. కాకినాడలోని పోలీసు రిజర్వులైనులో రూ.1.35 కోట్లతో నిర్మించిన కన్వెన్షన్‌ హాలును బుధవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.

కన్వెన్షల్‌ హాలును కేవలం పోలీసు సిబ్బందికే కాక బయట వారు కూడా ఫంక్షన్లు, పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలను చేసుకునేందుకు ఇస్తే ఆదాయం సమకూరుతుందన్నారు. ఆ రాబడిని పోలీసు కుటుంబాల సంక్షేమానికి ఉపయోగించాలని సూచించారు. ఇటీవల జిల్లాలో జరిగిన పలు సంఘటనల్లో శాంతిభద్రతలు భంగపడకుండా పోలీసులు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. రాష్ట్రం విడిపోయాక పోలీసు సిబ్బంది సరిపడినంతగా రాష్ట్రానికి రాలేదన్నారు. ప్రస్తుతం నియామకానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాష్, ఏఎస్పీ దామోదర్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement