
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్ (జలాశయం)లో ఇప్పటి వరకూ చేసిన పనులను గోదావరి వరద నుంచి రక్షించడం, రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోవాల్సిన కొన్ని ఎంవోయూలు, పనుల పురోగతి, పెండింగ్ బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై చర్చించేందుకు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) గురువారం భేటి అయింది. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్, సహాయ పునరావాస కమిషనర్ రేఖారాణి, ప్రాజెక్ట్ అధారిటీ సీఈవో ఆర్కె జైన్, సభ్య కార్యదర్శి పాండే తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీకి ప్రత్యేత ఆహ్వానితులుగా ప్రాజెక్ట్ డిజైన్ కమిటీ చైర్మన్ పాండ్యా, కేంద్ర జల సంఘం సభ్యుడు హాల్దార్, ప్రాజెక్టుల కమిటీ కమిషనర్ ఓరా హాజరయ్యారు. పీపీఏ సమావేశం ముగిసిన తర్వాత సీఈవో ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి బీపీ పాండేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ప్రాజెక్టు పురోగతిపై నివేదిక అందజేస్తారు.