‘గ్యాస్ నిర్వహణకు సీఎం జగన్‌తో చర్చిస్తాం’

Pilli Subhash Chandra Bose Visits ONGC Gas Leakage In East Godavari - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి, కాకినాడ:  జిల్లాలోని కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామంలో ఆదివారం ఓఎన్‌జీసీ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్‌ పెద్ద శబ్దంతో ఎగసిపడిన విషయం తెలిసిందే. అయితే ఉప్పూడి ఓఎన్‌జీసీ గ్యాస్‌ లీక్‌ ప్రదేశాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకవుతున్న గ్యాస్‌ ఫైర్‌ అయ్యే అవకాశం లేదన్నారు. సోమవారం సాయత్రం వరకు లీక్‌ అవుతున్న గ్యాస్‌ను అదుపుచేయాలని  అధికారులను ఆదేశించారు. గ్యాస్‌ లీక్‌ను అదుపు చేసేందుకు ఓఎన్‌జీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పేర్కొన్నారు. చడవండి: కోనసీమలో గ్యాస్‌ బ్లో అవుట్‌

ఉప్పుడి గ్యాస్ సంఘటన మానవ తప్పిదం వల్లే  జరిగిందని మంత్రి విశ్వరూప్‌ అన్నారు. నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందన్నారు.  ఓఎన్‌జీసీ అధికారులు గ్యాస్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రెండు పద్ధతుల్లో గ్యాస్‌ను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. మూడు నాలుగు గంటల్లో అదుపు చేయడానికి అవకాశం ఉందని విశ్వరూప్‌ చెప్పారు. కోనసీమలో గ్యాస్ తవ్వకాలు, నిర్వహణకు సంబంధించి సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో చర్చిస్తామని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top