జనాల కష్టం తెలుసుకున్నారు | PeopleSupport to YS Jagan Praja Sankalpa Yatra | Sakshi
Sakshi News home page

జనాల కష్టం తెలుసుకున్నారు

Jan 10 2019 7:32 AM | Updated on Jan 10 2019 7:32 AM

PeopleSupport to YS Jagan Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం :పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల ముందుకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్న నాయకుడిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు. రానున్నది రాజన్న రాజ్యమే. ఆంధ్రప్రదేశ్‌కు సువర్ణ యుగం రాబోతోంది. జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం. నవరత్న పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది.బి.కోటేశ్వరరావు నాయక్,అíసిస్టెంట్‌ ప్రొఫెసర్, గుంటూరు

పశువులకు బీమా ఇవ్వాలి
మా జిల్లాలో యాదవ సామాజిక వర్గం అన్ని రకాలుగా వెనుకబడి ఉంది. మాకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి. పశువుల కాపరులకు ప్రమాద బీమాగా రూ. 10 లక్షలు వర్తింప జేయాలి. బీసీ–డీ నుంచి బీసీ–ఏగా మార్పు చేయాలి. ప్రమాదవశాత్తు గొర్రెలు మృతి చెందితే రూ.10 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, గొర్రెలు పెంపకం సొసైటీలు ఏర్పాటు చేయాలి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అందరికీ న్యాయం జరుగుతుంది.ఎం.వెంకటరావు, యాదవ సంఘ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement