కువైట్‌లో చాకిబండ వాసి మృతి | one person dead in kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో చాకిబండ వాసి మృతి

Jan 11 2017 10:47 PM | Updated on Sep 5 2017 1:01 AM

చిన్నమండెం మండల పరిధిలోని చాకిబండ గ్రామం బలిజపల్లెకు చెందిన పి. నాగరాజ(38) శనివారం కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అతని సమీప బంధువులు పేర్కొన్నారు.

చిన్నమండెం(రాయచోటి రూరల్‌):  చిన్నమండెం మండల పరిధిలోని చాకిబండ గ్రామం బలిజపల్లెకు చెందిన పి. నాగరాజ(38) శనివారం కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అతని సమీప బంధువులు పేర్కొన్నారు. జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి, నిత్యం కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వస్తున్న వ్యక్తి ఆకస్మికంగా రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, భార్య లక్ష్మీ కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామం బలిజపల్లెలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృతి చెందడంతో భార్య, పిల్లలు దీపక(8), రిషిక(4), శ్రీహాన్‌(2)లు ఆదరణ కోల్పోయారు. ప్రభుత్వం సాయం అందించి కుటుంబానికి అండగా ఉండలాని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement