
వై.విశ్వేశ్వర్ రెడ్డి
హంద్రీనీవా త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కూడేరు, విడపనకల్లు మండల కేంద్రాలలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు.
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కూడేరు, విడపనకల్లు మండల కేంద్రాలలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. హంద్రీనీవాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్ర చేయడం కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికేనని ఆయన విమర్శించారు.
అనంత జీవనాడి హంద్రీనీవాను వెంటనే పూర్తి చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.