ప్రజాగర్జన వేదికను తొలగిస్తాం | officials threaten to remove tdp praja garjana stage | Sakshi
Sakshi News home page

ప్రజాగర్జన వేదికను తొలగిస్తాం

Mar 11 2014 11:51 AM | Updated on Aug 10 2018 8:01 PM

విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించతలపెట్టిన ప్రజాగర్జన సభ తుస్సుమనేలాగే ఉంది.

విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించతలపెట్టిన ప్రజాగర్జన సభ తుస్సుమనేలాగే ఉంది. ఇప్పటివరకు ఆ సభ నిర్వహణకు అసలు అనుమతే రాలేదు. ఈరోజు మధ్యాహ్నం లోగా సభకు అనుమతి రాని పక్షంలో ఇప్పటికే అక్కడ ఏర్పాటుచేసిన సభా వేదికను తాము తొలగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు టీడీపీ సభపై మత్స్యకారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీచ్ రోడ్డులో సభ నిర్వహిస్తే పర్యావరణం దెబ్బతింటుందని వారు అంటూ, ఈ మేరకు పర్యావరణ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సభను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు.

వాస్తవానికి ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్స్లో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ ఇంతకుముందే నిరాకరించింది. బీచ్ రోడ్డులో సభ ఏర్పాటుచేస్తే వాస్తుపరంగా అనుకూలంగా ఉండదని, అందువల్ల సభ ఎక్కడ నిర్వహించాలోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు తర్జనభర్జన పడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement