'గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం' | ntr statue to be setup at godavari river bank | Sakshi
Sakshi News home page

'గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం'

May 29 2015 12:08 PM | Updated on Aug 11 2018 4:28 PM

'గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం' - Sakshi

'గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం'

గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.  పుష్కరాల కోసం 248 పుష్కర ఘాట్ లను సిద్ధం చేసినట్టు చెప్పారు. వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. మహానాడులో మూడో రోజు గోదావరి పుష్కరాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పవిత్ర గోదావరిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నదుల అనుసంధానంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. గోదావరి జలాలు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు. గోదావరి ఒడ్డున శ్రీకృష్ణుడి వేషధారణలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement