ముహూర్తంతో ముందుకు

Nominations Started In West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు (మెట్రో) : సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో సంబంధిత అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియలోని కీలకమైన మొదటి దశలోకి అడుగుపెట్టారు. కీలక ప్రక్రియ అయిన నామినేషన్ల పర్వానికి బుధవారం తెరలేపారు. జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ప్రధాన ఎంపీ స్థానాలకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను బుధవారం మొదలు పెట్టారు. జిల్లాలో ఒక వైపు పార్టీల అధినేతలు ప్రచార పర్వాలు కొనసాగిస్తుంటే మరోవైపు ఆయా పార్టీల అభ్యర్థుల వారి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేస్తున్నారు. మంగళవారం పోలవరం నియోజవర్గం నుంచి వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తే బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో రెండు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచార సభలు పెట్టారు. అధినేతలు ప్రచారాలు ఒక ఎత్తయితే అభ్యర్థులు నామినేషన్ల పత్రాలు మరో వైపు దాఖలవుతున్నాయి.

జిల్లాలో నరసాపురంలో వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి అయిన రఘురామకృష్ణంరాజు బుధవారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. అదే విధంగా తాడేపల్లిగూడెం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ, కొవ్వూరు అభ్యర్థి తానేటి వనిత నామినేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. అదే విధంగా దెందులూరు తెలుగుదేశం అభ్యర్థిగా చింతమనేని ప్రభాకర్‌ బుధవారం నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.              
ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియను బుధవారం వారి ముహూర్తాల ప్రకారం పూర్తి చేశారు. ఏలూరు పార్లమెంటు అభ్యర్థిగా లోక్‌సభ స్థానానికి పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా జ్యోత్సుల వెంకట సూర్యనారాయణ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు అందించారు.   

మొత్తం నామినేషన్లు
అసెంబ్లీకి 20 నామినేషన్లు, 26 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంటు స్థానాలకు 2, దీనికి గాను 4 సెట్లు దాఖలయ్యాయి.

పార్లమెంటు స్థానాలకు ఇలా..
నరసాపురం    1
ఏలూరు    1

అసెంబ్లీ స్థానాలకు ఇలా..
కొవ్వూరు           3
నిడదవోలు         2
ఆచంట              4
ఉండి                 1
తణుకు              2
తాడేపల్లిగూడెం    2
ఉంగుటూరు        2
దెందులూరు       3
పోలవరం           1
పాలకొల్లు           –
నర్సాపురం         –
భీమవరం           –
ఏలూరు             –
గోపాలపురం        –
చింతలపూడి       –

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top