సంక్రాంతి సందడి షురూ..
తెలుగువారికి సంక్రాంతి ఎంతో ముఖ్యమైన పండగ. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండగ జరుపుకొంటారు.
భోగి పండగ నేడే
నెల్లూరు(అర్బన్): తెలుగువారికి సంక్రాంతి ఎంతో ముఖ్యమైన పండగ. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండగ జరుపుకొంటారు. రైతుల పండగ కాబట్టే పల్లెల్లో ఇంటింటా సందడి వాతావరణం. ప్రతి ఇంటా పిండివంటలు చేసుకోవడం, కొత్త దుస్తులు కొనుక్కోవడం ఆనవాయితీ. జిల్లాలో ఇప్పటికే పండగ సందడి మొదలైంది. పిల్లలు గాలిపటాలు ఎగురవేస్తూ సంక్రాంతిని ముందే తీసుకొచ్చారు. ఈ మూడు రోజుల్లో కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో భారీగా కోడి, ఎడ్ల పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నాలుగో రోజున ఏటి పండగను పెన్నా, స్వర్ణముఖి పరివాహన ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండగకు కొత్త బట్టలు కొనుగోలులో జనం బిజీబిజీగా ఉన్నారు. నెల్లూరు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా బుధవారం భోగి పండగను చేసుకొనేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. నగరంలోని పలు సెంటర్లలో తాటిమట్టలు పెట్టి అమ్మారు. పెద్దల పండగ కోసం బోడిగోడితోటను సిద్ధం చేస్తున్నారు.


