రోగులపై లేదు దయ | No patients in the mercy of the | Sakshi
Sakshi News home page

రోగులపై లేదు దయ

Jan 21 2014 3:47 AM | Updated on Aug 28 2018 5:25 PM

పేదోళ్ల పెద్దాస్పత్రికి నీటికష్టాలు మొదల య్యాయి. 24 వైద్య విభాగాలకు నీళ్లు రావడం లేదు. వార్డుల్లోని టాయిలెట్ల కొళాయిల్లో...

  •       రోజుకు 3.5 లక్షల లీటర్ల కొరత
  •      చేతులెత్తేసిన కార్పొరేషన్ అధికారులు
  •      మరుగునపడిన ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం
  •      బాత్‌రూమ్‌లు, టాయిలెట్లలో నీళ్లు రాక నరకం
  •  
    తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: పేదోళ్ల పెద్దాస్పత్రికి నీటికష్టాలు మొదల య్యాయి. 24 వైద్య విభాగాలకు నీళ్లు రావడం లేదు. వార్డుల్లోని టాయిలెట్ల కొళాయిల్లో నీళ్లురాక రోగులు, వారి సహాయకులు నరకయాతన పడుతున్నారు.
         
    రుయా ఆస్పత్రికి చిత్తూరు, వైఎస్‌ఆర్, అనంతపురం, పొటి ్టశ్రీరాములు నెల్లూరు జిల్లాలతోపాటు తమిళనాడు రాష్ట్రం నుంచి రెం డు వేల మందికి పైగా రోగులు వస్తుంటారు.
         
    రోజుకు వెయ్యి మందికి పైగా ఇన్‌పేషెంట్లు వైద్య సేవలు పొందుతున్నారు.
         
    వీరందరికీ నిత్యం సుమారు 5.5 లక్షల లీటర్ల నీళ్లు అవసరం.
         
    1.9 లక్షల లీటర్ల నీళ్లుమాత్రమే అందుబాటులో ఉన్నాయి.
         
    రోజుకు సుమారు 3.6 లక్షల లీటర్ల నీటి కొరత ఏర్పడుతోంది.
         
    అందుబాటులో ఉన్న నీటిని నిల్వచేసే సంపుల నిర్వహణ గాలికొదిలేశారు.
         
    ఆస్పత్రిలోని ‘బర్న్స్’వార్డుకు ఎదురుగా ఉన్న సంప్‌లో లక్ష లీటర్ల నీటిని, ఐడీహెచ్ వార్డుకు సమీపంలోని సంప్‌లో 20 వేల లీటర్ల నీటిని మాత్రమే నిల్వ చేస్తున్నారు.
         
    70 వేల లీటర్ల నీటిని మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
         
    బర్న్స్ వార్డుకు ఎదురుగా ఉన్న ప్రధాన సంప్‌నకు పక్కనే మురుగునీరు ప్రవహిస్తోంది.
         
    రెండు సంప్‌ల నుంచి వివిధ వార్డులకు సరఫరా చేసే పైప్‌లైన్లు తుప్పుపట్టి పోయాయి.
     ఓవర్‌హెడ్ ట్యాంకులన్నీ ప్రతిపాదనలకే పరిమితం
         
    రుయా ఆస్పత్రిలో ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం నాలుగేళ్లుగా ప్రతిపాదనల దశ దాటనంటోంది.
         
    2008 డిసెంబర్‌లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రుయా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి కావాల్సిన నిధులను హాస్పిటల్ డెవలప్‌మెంట్ ఫండ్(హెచ్‌డీఎఫ్) నుంచి మంజూరు చేశారు.
         
    ఆయన మరణానంతరం ట్యాంకుల నిర్మాణ పనులను గాలికొదిలేశారు.
         
    నాలుగేళ్లు గడిచిపోతున్నా ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి అతీగతీ లేకుండా పోయింది.
         
    ఆరోగ్య విభాగం అధికారులు రెండు, మూడుసార్లు పంపి న ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయిలో మోక్షం కరువయింది.
     మరమ్మతులకు నోచుకోని బోర్లు
         
    ఆస్పత్రిలోని 7 నీటి బోర్లలో ఇప్పటికే 4 బోర్లు నీళ్లులేక ఎండిపోయాయి.
         
    ఆ బోర్లను డీపెనింగ్ చేస్తే కొంతవరకైనా నీళ్లు వచ్చే అవకాశం ఉంది.
         
    కానీ ఆ బోర్ల మరమ్మతుల గురించి దాదాపు రెండేళ్లుగా అధికారులు పట్టించుకోవడం లేదు.
         
    {పస్తుతం అరకొరగా 3 బోర్లు పనిచేస్తున్నాయి.
         
    పాలకుల హామీలు నీటిమూటలుగానే మారుతున్నాయి.
     
    చేతులెత్తేసిన కార్పొరేషన్
    రుయాకు అవసరమైన నీటిని పూర్తిస్థాయిలో అందించాల్సిన కార్పొరేషన్ అధికారులు చేతులెత్తేశారు.

    కార్పొరేషన్‌కు నెలవారీగా నిధులు చెల్లించినా ఫలితం లేకపోతోంది.
         
    రెండ్రోజులకోసారి కార్పొరేషన్ నుంచి సరఫరా అవుతున్న నీళ్లు ఏ మూలకూ చాలడం లేదు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement