తెలంగాణను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు | No force can stop Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణను ఆపే శక్తి ఎవ్వరికీ లేదు

Oct 3 2013 6:12 AM | Updated on Sep 1 2017 11:18 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే శక్తి ఎవ్వరికీ లేదని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావడం ఖాయమన్నారు.

ధర్పల్లి, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపే శక్తి ఎవ్వరికీ లేదని పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్ అన్నారు.  తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా దయ, ఆశీస్సులే తన బలం అని అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బంజార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో జరిగే పరిణామాలతో పాటు,  యువకుల ఆత్మబలిదానాలపై సోనియా కు వివరిస్తే  స్పందించి రాష్ట్ర  ఏర్పాటుకు ప్రకటన వచ్చిం దన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం సోనియా చుట్టూ ప్రదక్షిణలు చేశానని చెప్పారు. కో ట్లు సంపాదించే నాయకుడు ప్రజా నాయకుడు కా లేడన్నారు.  సీమాం ధ్రులు రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరారు. వారి ప్రాంతానికి నిధుల కోసం డి మాండ్ చేసుకోవచ్చని సూచించారు. ప్రేమ పూర్వకంగా విడిపోవటమే మంచి పరిణామన్నారు. 2000లోనే అసెంబ్లీ లో తెలంగాణ కోసం మూడు గంటలు మాట్లాడాన ని గుర్తు చేశారు.  సోనియాగాంధీ తనను ఎక్కడి నుంచి పోటీ చే యమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement