ఈ పంటకు పరిహారం ఇవ్వరట! | Sakshi
Sakshi News home page

ఈ పంటకు పరిహారం ఇవ్వరట!

Published Wed, Mar 5 2014 2:29 AM

no compensation according to government rules

ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్:  ఏడెనిమిది నెలల పాటు పంటను కంటికి రెప్పలా కాపాడారు. చేతికి వచ్చిన పంటను రిక్కి, ఉడికించి కల్లాల వద్ద ఆరబెట్టుకున్నారు. మార్కెట్‌కు తరలించే లోపే అకాల వర్షం కాటేసింది. పంటంతా తడిసి ముద్దయ్యింది. రంగు మారిన పంటను అమ్ముదామంటే రేటు కూడా రాదు. పంటను పొలం నుంచి తవ్వితీసినందున నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం రాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పసుపు పంటను పండించిన రైతులు దిక్కుతోచని స్థి తిలోకి పడిపోయారు. కళ్ల ముందే పాడైపోయిన పసుపును చూసి కన్నీంటి పర్యంతమవుతున్నారు.

ఆర్మూర్ సబ్ డివిజన్‌లోని ఆర్మూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, సిరికొండ, భీమ్‌గల్, నందిపేట్ మండలాల్లో వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కలాల వద్ద ఆరబెట్టిన పసుపునకు న ష్టం వాటిల్లింది. రైతులు వేల రూపాయలు ఖర్చుచేసి పంటను పండించారు. ఆరబెట్టిన పసుపు వర్షానికి త డిసి నష్టం వాటిల్లితే ఎందుకు పరిహారం చెల్లంచరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపునకు పరిహారం అంచనా వేయించాలని డిమాండ్ చేస్తున్నారు.

 వైఎస్‌ఆర్ హయాంలో న్యాయం
 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హయాంలో అకాలవర్షాలతో కల్లాల వద్ద ఆరబెట్టిన పసుపు పంట కు నష్టం వాటిల్లితే పరిహారం చెల్లించారు. ప్రభుత్వ ని బంధనలు సడలించి నష్టపరిహారం అందేలా అప్పటి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు. తడిసిపోయిన ఎకరం పసుపు పంటకు రూ. రెండు వేల చొప్పున రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ను ఆదర్శంగా తీసుకుని తడిసిన పసుపు నకు నష్టం పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
 

Advertisement
Advertisement