శ్రీనివాసరావు బెయిల్‌ పొడగింపు

NIA Court Extend Srinivasa Rao Bail For July 12 In YS Jagan Murder Attempt Case - Sakshi

సాక్షి, విజయవాడ : గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై  విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన జె.శ్రీనివాసరావు బెయిల్‌ను ఎన్‌ఐఏ కోర్టు పొడగించింది. జూలై 12 వరకు బెయిల్‌ను పొడగిస్తూ ఏఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. బుధవారం విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో శ్రీనివాసరావును పోలీసులు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ ను రద్దు చేయాలంటూ అధికారులు కోర్టును కోరారు.  విచారణ చేపట్టిన ధర్మాసనం శ్రీనివాస్‌రావు బెయిల్‌ను వచ్చే నెల 12 వరకు పొడగించింది. 2018 అక్టోబర్ 25న వైఎస్‌ జగన్‌పై శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొని... హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఆయనపై దాడి జరిగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top