న్యూస్ ప్రజెంటర్ బద్రి అంత్యక్రియలు పూర్తి | News presenter Badri full funeral | Sakshi
Sakshi News home page

న్యూస్ ప్రజెంటర్ బద్రి అంత్యక్రియలు పూర్తి

Feb 10 2015 2:26 AM | Updated on Sep 2 2017 9:02 PM

న్యూస్ ప్రజెంటర్ బద్రి అంత్యక్రియలు పూర్తి

న్యూస్ ప్రజెంటర్ బద్రి అంత్యక్రియలు పూర్తి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ9 న్యూస్ ప్రజెంటర్ వీరభద్రయ్య(బద్రి)కి పలువురు నివాళులర్పించారు.

విజయవాడ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీవీ9 న్యూస్ ప్రజెంటర్ వీరభద్రయ్య(బద్రి)కి పలువురు నివాళులర్పించారు. ద్వారకాతిరుమల వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో మృతి చెందిన బద్రి భౌతికకాయాన్ని విజయవాడ సూర్యారావుపేటలోని తండ్రి ఇంటికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభం కాగా, విజయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బద్రి భార్య లక్ష్మీసుజాతను బయటకు తీసుకువచ్చి భర్తను కడసారి చూపించారు. దీంతో ఆమె కన్నీరు మున్నీరైంది.

అనంతరం బద్రి, చిన్న కుమారుడు సాయి సాత్విక్ భౌతికకాయాలకు కృష్ణలంకలోని స్వర్గపురిలో దహనసంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు, సహచరులు పాల్గొన్నారు. కాగా, విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బద్రి భార్య లక్ష్మీసుజాత, పెద్ద కొడుకు సాయిదీపక్(13) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సాయిదీపక్ వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నాడు. ఇంకో 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement