
కొత్త పార్టీ ఆవశ్యకత ఉంది: సబ్బం హరి
సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాడిన నేతలతో రాష్ట్రంలో కొత్త పార్టీ నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని సబ్బం హరి అన్నారు.
విశాఖపట్నం: సమైక్యాంధ్ర కోసం చిత్తశుద్ధితో పోరాడిన నేతలతో రాష్ట్రంలో కొత్త పార్టీ నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి అన్నారు. విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని చెప్పారు.
మరో 8 మాసాలు చూసి కొత్త పార్టీ కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనకు సహకరించిన స్వార్థపరులంతా ఇప్పుడు ముసుగు వేసుకుని కొత్త పార్టీల పేరుతో ప్రజల్లోకి వస్తున్నారని విమర్శించారు. మళ్లీ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్న అలాంటి నేతలను అడ్డుకోవాలన్నారు.