మద్యమే ఎన్నో అనర్థాలకు కారణం: నారాయణ స్వామి

Narayana Swamy Inaugurated Liquor Prohibition Committee - Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 43వేల బెల్ట్‌షాపులు తొలగించిందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదివారం గుంటురూలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయవనరుగా చూడటం లేదని పేర్కొన్నారు. సమాజంలో మద్యమే ఎన్నో అనర్థాలకు కారణమని నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణ్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top