నగరం ఘటనలో 22కి చేరిన మృతులు | Nagaram incident : GAIL gas pipeline explosion death toll reaches 22 | Sakshi
Sakshi News home page

నగరం ఘటనలో 22కి చేరిన మృతులు

Jul 29 2014 9:06 AM | Updated on Sep 2 2017 11:04 AM

నగరం గ్రామంలో గెయిల్ సంస్థకు చెందిన పైప్ లైన్ విస్పోటం (ఫైల్ ఫొటో)

నగరం గ్రామంలో గెయిల్ సంస్థకు చెందిన పైప్ లైన్ విస్పోటం (ఫైల్ ఫొటో)

తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ పైపు లైన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరిబాబు (58) మృతి చెందాడు.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా నగరంలో గెయిల్ పైపు లైన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరిబాబు (58) మృతి చెందాడు. దీంతో నగరం గెయిల్ పైపు లైన్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 22కి చేరింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో గెయిల్ సంస్థకు చెందిన పైపు లైన్ పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో 13 మంది సజీవ దహనం కాగా, మరో 19 మంది గాయపడ్డారు.

వారిలో ఏడుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటికే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం అమలాపురంలోని కిమ్స్ నుంచి కాకినాడ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అలా కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూరిబాబు మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement