23న సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం | nagabhairava award Presented on 23 Suddala Ashok Teja | Sakshi
Sakshi News home page

23న సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం

Nov 11 2014 1:06 AM | Updated on Sep 2 2017 4:12 PM

23న సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం

23న సుద్దాలకు నాగభైరవ అవార్డు ప్రదానం

ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు-2014 అవార్డును ప్రముఖ సినీకవి సుద్దాల అశోక్‌తేజకు ఈనెల 23న ప్రదానం చేయనున్నారు.

నెల్లూరు: ప్రతిష్టాత్మక డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు-2014 అవార్డును ప్రముఖ సినీకవి సుద్దాల అశోక్‌తేజకు ఈనెల 23న ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు అవార్డు కమిటీ అధ్యక్షుడు వెన్నెలకంటి, ప్రధాన కార్యదర్శి చిన్నివెంకటేశ్వరరావు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అలాగే ప్రముఖ కవి అద్దంకి శ్రీనివాస్‌కు నాగభైరవ సాహితీ అవార్డు , ఆరుగురు కవులకు నాగభైరవ స్ఫూర్తి అవార్డులను అందజేయనున్నట్టు వెల్లడించారు. వారిలో ఏటూరి నాగేంద్ర కుమార్(నెల్లూరు), కోసూరు రవికుమార్(గుంటూరు), తూమాటి సంజీవరావు(చెన్నై), కోకావిమలకుమారి(విజయవాడ), అద్దేపల్లి జ్యోతి(కాకినాడ), శ్రీరామకవచం(ఒంగోలు) ఉన్నారని తెలిపారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement