విజయనగరం మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మీసాల గీత పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి గీత రాజీనామా
Feb 17 2014 2:42 AM | Updated on Mar 18 2019 7:55 PM
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్ : విజయనగరం మున్సిపల్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మీసాల గీత పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామికి పంపించారు. చిరంజీవిపై అభిమానంతో ప్రజారాజ్యంలో చేరిన గీత తర్వాత చోటుచేసుకున్న పరిణామాల వల్ల కాంగ్రెస్‌లో కొనసాగారు. అయితే పార్టీలో చేరినప్పటి నుంచి తనను, వర్గీయులను పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement