డిసెంబర్‌ 6లోగా హామీ అమలు చేయండి | Mudragada letter to the chandrababu on Kapu reservation | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 6లోగా హామీ అమలు చేయండి

Sep 13 2017 1:54 AM | Updated on Jul 30 2018 6:25 PM

డిసెంబర్‌ 6లోగా హామీ అమలు చేయండి - Sakshi

డిసెంబర్‌ 6లోగా హామీ అమలు చేయండి

‘బ్రిటిష్‌ పాలనలో మా జాతికి ఉన్న బీసీ రిజర్వేషన్లు తీసేయాలని అనుకున్నప్పటికీ, లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో

కాపు రిజర్వేషన్లపై ముఖ్యమంత్రికి ముద్రగడ లేఖ
 
కిర్లంపూడి: ‘బ్రిటిష్‌ పాలనలో మా జాతికి ఉన్న బీసీ రిజర్వేషన్లు తీసేయాలని అనుకున్నప్పటికీ, లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కాపులకు రిజర్వేషన్లు కొనసాగించా లంటూ ఆ సదుపాయాన్ని కాపాడిన మహానుభావుడు అంబేడ్కర్‌. ఆయన వర్ధంతి రోజైన డిసెంబర్‌ 6 నాటికి కాపులకు ఇచ్చిన బీసీ రిజర్వేషన్‌ హామీని అమలు చేయాలి’ అని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు.

దాని ప్రతులను కిర్లంపూడిలో విలేకర్లకు విడుదల చేశారు. డిసెంబర్‌ 6లోగా రిజర్వేషన్లు అమలు చేయకపోతే తమవద్ద రెండు ఆప్షన్లున్నాయని, సీఎం నిర్ణయాన్నిబట్టి ఏదో ఒకటి అమలు చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement