మంత్రి కిషోర్‌బాబును అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు | mrps leaders stops kishorebabu | Sakshi
Sakshi News home page

మంత్రి కిషోర్‌బాబును అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

Feb 7 2015 4:10 PM | Updated on Oct 22 2018 7:32 PM

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మందకృష్ణ మాదిగపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్నాయకులు ఒంగోలులో ఆయనను అడ్డుకున్నారు.

ఒంగోలు(ప్రకాశం జిల్లా): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు మందకృష్ణ మాదిగపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మార్పీఎస్నాయకులు ఒంగోలులో ఆయనను అడ్డుకున్నారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ మందకృష్ణ మాదిగకు డబ్బులు ఇవ్వడంతో ఆయన ఆ పార్టీని విమర్శించడంలేదని ఆరోపించారు. దీంతో శనివారం ఒంగోలులో మరో మంత్రి సిద్దరాఘవరావు ఇంటి వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులుకిషోర్‌బాబును అడ్డుకున్నారు. ఆయన వారిని పట్టించుకోకపోవడంతో సిద్ధరాఘవరావు ఇంటి ముందు నినాదాలు చేశారు. దీంతో ఆయన వారిని ఇంటిలోకి పిలిచి మంతనాలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement