వైఎంహెచ్‌ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని | Minister Alla Nani Participated Awards Program In Eluru | Sakshi
Sakshi News home page

 వైఎంహెచ్‌ఏ అభివృద్ధికి కృషి చేస్తా: ఆళ్ల నాని

Sep 26 2019 9:59 PM | Updated on Sep 26 2019 10:25 PM

Minister Alla Nani Participated Awards Program In Eluru - Sakshi

సాక్షి, ఏలూరు: వైఎంహెచ్‌ఏ హాలు అభివృద్ధికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఏలూరు వైఎంహెచ్‌ఏ హాలులో గురువారం కేవీఎస్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు బహుకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవీఎస్‌ లాంటి వ్యక్తి ఏలూరులో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. దేశ విదేశాల్లో కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పేరు ప్రఖ్యాతలను సంపాందించిన కేవీఎస్‌ను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికార భాషా సంఘం ఛైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌, ఉష గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ వివి బాలకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement