ఆసిఫ్‌అలీ కోసం మీరట్‌కు... | Meerut for Asif Ali | Sakshi
Sakshi News home page

ఆసిఫ్‌అలీ కోసం మీరట్‌కు...

Aug 24 2014 1:06 AM | Updated on Aug 20 2018 4:44 PM

దేశద్రోహానికి పాల్పడిన మిలటరీ అధికారి పటన్‌కుమార్ ఉదంతంలో మూడు రోజుల క్రితం ఆసిఫ్‌అలీని మీరట్ పోలీసులు అరెస్టు చేశారు.

పీటీ వారెంట్‌పై తీసుకువచ్చేందుకు వెళ్లిన సీసీఎస్ పోలీసులు
 
హైదరాబాద్: దేశద్రోహానికి పాల్పడిన మిలటరీ అధికారి పటన్‌కుమార్ ఉదంతంలో మూడు రోజుల క్రితం ఆసిఫ్‌అలీని మీరట్ పోలీసులు అరెస్టు చేశారు. అనుష్కా అగర్వాల్ ఆదేశాల మేరకు పటన్ బ్యాంకు అకౌంట్‌కు డబ్బులు పంపింది ఆసిఫ్‌గా గుర్తించారు. బ్యాంకు సీసీ కెమెరాల ఫుటేజ్‌ల ఆధారంగా మీరట్ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. అతన్ని నగరానికి తెచ్చేందుకు పీటీ వారెంట్ కోసం సీసీఎస్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

మీరట్ జైలులో ఉన్న ఆసిఫ్‌ని నగరానికి తీసుకువస్తారు.అతన్ని పోలీసు కస్టడీలో విచారిస్తారు.ఈ కేసులో అనుష్క కోసం ఆరా తీస్తున్నారు.వచ్చే జీతం సరిపోక 15 ఏళ్లలో మనీసర్కులేషన్ స్కీమ్ ద్వారా కోటీశ్వరుడిని కావాలకున్నానని పటన్ వెల్లడించినట్లు తెలిసింది. అందుకు గత ఏడాది ‘ఎమ్‌ఎల్‌ఎమ్ సెక్యూర్డ్ లైఫ్’ స్కీమ్‌ను ప్రారంభించానని, ఈ స్కీమ్‌లో మిలటరీ అధికారులు, సుబేదార్లను సభ్యులుగా చేర్పించినట్లు చెప్పాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement