మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య | man committed suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య

Mar 24 2015 4:59 PM | Updated on Nov 6 2018 7:56 PM

మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య - Sakshi

మనస్తాపంతో అటెండర్ ఆత్మహత్య

ప్రధానోపాధ్యాయుడు మందలించాడని అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

చింతలపూడి : ప్రధానోపాధ్యాయుడు మందలించాడని అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడికి చెందిన కాళ్ల రమణారావు(45) అనే వ్యక్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిన అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తమ నుంచి వసూలు చేసిన ఫీజులను సొంత పనులకు వాడుకున్నాడంటూ విద్యార్థులు కొన్ని రోజుల కిందట ఫిర్యాదు చేయడంతో ప్రధానోపాధ్యాయుడు రమణారావును మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన రమణారావు సోమవారం ఇంటినుంచి వెళ్లిపోయాడు. కాగా ఈరోజు ఉదయం ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని పొలాల్లో విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి జేబులో ఉన్న సూసైడ్ నోట్‌లో తన చావుకు అధ్యాపకుల తీరే కారణమని పేర్కొన్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement