తల్లి మందలించిందని.. ఆత్మహత్య | Man Commit Suicide After Scolded By Mother in Vizianagaram | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిందని.. ఆత్మహత్య

Aug 5 2019 11:13 AM | Updated on Aug 5 2019 11:14 AM

Man Commit Suicide  After Scolded By Mother in Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం టౌన్‌ : వ్యసనాలకు బానిసకావద్దని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయనగరం పట్టణంలో ఆదివారం వెలుగుచూసింది. దీనికి సం బంధించి రూరల్‌ పోలీసులందించిన వివరాలిలా ఉన్నాయి.  స్థానిక సుంకర వీధికి చెందిన కె.రాజశేఖర్‌ (20) భవన నిర్మాణం జరుగుతున్న సైట్‌లో వాచ్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏడాది కిందట కల్యాణి అనే అమ్మాయిని  ప్రేమ వివాహం చేసుకున్నాడు. తర్వాత వ్యసనాలకు బానిసై కుటుంబ సభులతో ఎప్పుడూ తగాదాలు పడుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తల్లి మందలించడంతో ఏడుస్తూ వెళ్లిపోయి పద్మావతీనగర్‌ ధర్మపురి గాయత్రీనగర్‌ సమీపంలో సైట్‌పక్కన గుడిసెలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ ఫక్రుద్దీన్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement