నెల్లూరు జిల్లాలో దారుణం | man attacked on student in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో దారుణం

Jul 2 2016 4:56 PM | Updated on Sep 4 2017 3:59 AM

నెల్లూరు జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకుంది.

కావలి: నెల్లూరు జిల్లాలో శనివారం దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కావలిలో ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి సాయి పై మహేష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. ఇది గుర్తించిన స్థానికులు విద్యార్థిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపధ్యంలోనే ఈ దాడి జరిగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement