జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయండి | Make jedpi chairman arrested | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయండి

Nov 19 2014 3:07 AM | Updated on Aug 20 2018 4:44 PM

జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయండి - Sakshi

జెడ్పీ చైర్మన్‌ను అరెస్టు చేయండి

కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌ను తక్షణమే అరెస్టు చేయూలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

కర్నూలు(అగ్రికల్చర్): కల్తీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌గౌడ్‌ను తక్షణమే అరెస్టు చేయూలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య మంగళవారం సాయంత్రం కలెక్టర్ సిహెచ్.విజయ్ మోహన్, ఎస్పీ ఆకే రవికృష్ణకు వినతిపత్రం అందించారు.

ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా కల్తీ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహించడం దారుణమైన విషయమన్నారు. కేసులో నిందితుడిగా ఉండి కూడా ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, అరుునా అరెస్టు చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ కూడా ఆయనను అరెస్టు చేయూలని కోరుతోందన్నారు.

ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అరెస్ట్ చేయడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు జెడ్పీ చైర్మన్‌ను ఎందుకు ఉపేక్షిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి నిలదీశారు. అవినీతిని సహించేది లేదని చెబుతున్న సీఎం ఈ విషయంపై స్పందించకపోవడం సరికాదన్నారు.

మొన్నటి దాకా అజ్ఞాతంలో ఉన్న చైర్మన్ సోమవారం అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని బట్టి ఉన్నత స్థాయిలో మ్యానేజ్ చేసుకొని వచ్చినట్లుగా తెలుస్తోందన్నారు. తక్షణం అరెస్టు చేయకపోతే డీజీపీ, ఎక్సైజ్ ఉన్నతాధికారులను కలుస్తామని, పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఉన్నత స్థాయి నుండి వచ్చిన ఆదేశాలకు లొంగి పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఎమ్మెల్యేలు గౌరుచరిత, ఐజయ్య ఆరోపించారు. ఇప్పటికైనా అరెస్టు చేసి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement