ఆఫీసుకు రా.. తేల్చుకుందాం! | Mahanadi Devasthanam Eo fire on sakshi reporter | Sakshi
Sakshi News home page

ఆఫీసుకు రా.. తేల్చుకుందాం!

Apr 8 2018 10:22 AM | Updated on Aug 20 2018 8:24 PM

మహానంది: ‘దేవస్థానంలో జరిగే కార్యక్రమాలకు ఎవరిని పిలుచుకోవాలో నాకు తెలీదా? నా ఇష్టమొచ్చినట్టే చేస్తాను. నువ్వెవడివి అడగడానికి?’ అంటూ మహానంది దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎన్‌సీ సుబ్రహ్మణ్యం ‘సాక్షి’ విలేకరిపై చిందులు తొక్కారు. ప్రముఖ దేవస్థానానికి ఈఓ అన్న సంగతి మరిచి..‘ఏయ్‌...ఉండు...ఆఫీసుకు రా తేల్చుకుందాం’ అంటూ ఓ ఫ్యాక్షన్‌ నాయకుడిలా బెదిరించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహానంది దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన రూపేష్‌ అనే దాత మూడు వీల్‌చైర్లను విరాళంగా ఇచ్చారు. వీటి ప్రారంభోత్సవానికి ఎలాంటి ప్రొటోకాల్‌ లేని కొందరు అధికార పార్టీ నేతలను ఈఓ ఆహ్వానించి.. వారితో ప్రారంభింపజేశారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో శనివారం ‘ఇదేమి భక్తి’ శీర్షికతో వార్త ప్రచురితమైంది. దీంతో మహానంది ఈఓ సుబ్రహ్మణ్యం ఉదయాన్నే ‘సాక్షి’ విలేకరికి ఫోన్‌ చేసి తిట్లదండకం అందుకున్నారు. ‘ఏం తమాషాగా ఉందా! గంటలోగా ఆఫీసుకు రా.. తేల్చుకుందాం’ అంటూ బెదిరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement