రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాలకొండ సమీపంలో ఎర్రగడ్డ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలంలోని వెంగళాపురానికి చెందిన నేలటూరి వెంకటేశ్వర్లు, కాంతమ్మలకు ఒక్కగానొక్క సంతానం మోనిక (15) పొన్నులూరు మండలం చెరుకుంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి చదువుతుంది.
పీసీ పల్లి, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాలకొండ సమీపంలో ఎర్రగడ్డ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలంలోని వెంగళాపురానికి చెందిన నేలటూరి వెంకటేశ్వర్లు, కాంతమ్మలకు ఒక్కగానొక్క సంతానం మోనిక (15) పొన్నులూరు మండలం చెరుకుంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి చదువుతుంది. స్కూల్‌కు వెళ్లేందుకు బుధవారం బస్సు లేకపోవడంతో మోనిక, అదే గ్రామానికి చెందిన కళ్యాణి గ్రామంలోని గంగమ్మ గుడి వద్ద వేచి ఉన్నారు. అదే పాఠశాల్లో చదువుతున్న పసల సోని అనే విద్యార్థి బైక్‌పై అగ్రహారం వైపు వెళ్తుండటంతో వీరిద్దరూ ఎక్కారు.
మార్గ మధ్యంలో లింగాల కొండ వద్ద బైక్‌కు ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న సోని కూడా బ్రేక్ వేయడంతో వేగం అదుపుకాక టైర్లు జారాయి. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. వెనుక కూర్చున్న మోనిక అక్కడిక క్కడే మృతి చెందగా, కళ్యాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న సోని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కల్యాణిని ఒంగోలు, సోనిని అగ్రహారం వైద్యశాలకు తరలించారు.
వద్దన్నా వెళ్లి పరలోకం చేరావా తల్లి
‘బస్సులు లేవు పాఠశాలకు ఈ రోజు వద్దన్నా..పదో తరగతి క్లాసులు పోతాయని చెప్పి వెళ్లి తిరిగిరాని లోకాని వెళ్లవా’ అమ్మా అంటూ మోనిక తల్లి కాంతమ్మ కన్నీటి పర్యంతమైంది. మౌనిక పుట్టిన రెండేళ్లకే తండ్రి వెంకటేశ్వర్లు హైదరాబాదులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.