హెచ్‌ఎండీఏకి చెందిన విలువైన భూములను అధికార యంత్రాంగం సీఎం కిరణ్ ఒత్తిడికి తలొగ్గి ఆయన మిత్రుడు అమరేందర్‌రెడ్డికి కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ లోకాయుక్తను ఆశ్రయించింది.
సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏకి చెందిన విలువైన భూములను అధికార యంత్రాంగం సీఎం కిరణ్ ఒత్తిడికి తలొగ్గి ఆయన మిత్రుడు అమరేందర్‌రెడ్డికి కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు జేఏసీ కోకన్వీనర్ శ్రీరంగారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. నందగిరిహిల్స్‌లో 4 ఎకరాల ఆరు గుంటల విలువైన భూమిని రూ.84.74 కోట్లకే అమరేందర్‌రెడ్డికి కట్టబెట్టారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చేందుకు బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని వారు కోరారు.