సాక్షి, హైదరాబాద్: హెచ్‌ఎండీఏ కోకాపేట భూముల వేలంలో రికార్డు బద్ధలైంది. ఎకరానికి రూ.137.25 కోట్లు చొప్పున పోయింది. ఫ్లాట్‌ట్‌నెంబర్ 17, 18 స్థలాలకుగానూ ఈ ధర పలికింది.
కోకాపేట నియోపోలిస్‌లో మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసిన సంగతి తెలిసిందే. కోకాపేట్ ప్లాట్లకు ఎకరానికి 99కోట్ల ఆఫ్‌సెట్ ధరతో ఇవాళ ఈ రెండు ప్లాట్లను విక్రయించింది. ప్లాట్ నెంబర్17లో 4.59 ఎకరాలు, 18లో 5.31 ఎకరాలు ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు గానూ 1,355.33 కోట్లు ధర పలికింది.
ఇక నవంబర్ 24న, 28న, డిసెంబర్ 3న మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది. గోల్డెన్ మైల్‌లోని సైట్-2లో 1.98 ఎకరాలు, మూసాపేట్‌లో 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల్లోని రెండు సైట్లను వేలం వేయనుంది. గోల్డెన్ మైల్‌కు 70 కోట్లు, మూసాపేట్ సైట్‌ను 75 కోట్ల చొప్పున ఆఫ్‌సెట్ ధరను హెచ్ఎండీఏ ఇప్పటికే నిర్ణయించింది.


