సీఎం కిరణ్ పచ్చి దుర్మార్గుడు: కోమటిరెడ్డి | Kiran Kumar Reddy Villain for Telangana, says komatireddy rajagopal reddy | Sakshi
Sakshi News home page

సీఎం కిరణ్ పచ్చి దుర్మార్గుడు: కోమటిరెడ్డి

Feb 16 2014 7:13 PM | Updated on Aug 29 2018 4:16 PM

సీఎం కిరణ్ పచ్చి దుర్మార్గుడు: కోమటిరెడ్డి - Sakshi

సీఎం కిరణ్ పచ్చి దుర్మార్గుడు: కోమటిరెడ్డి

సీఎం కిరణ్ పచ్చి దుర్మార్గుడని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.

భువనగిరి: సీఎం కిరణ్ పచ్చి దుర్మార్గుడని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.  నల్లగొండ జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. సీఎం పదవి ఇచ్చిన సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్నే ధిక్కరించేస్థాయికి కిరణ్ చేరాడన్నారు.

కిరణ్, చంద్రబాబు ఎన్ని కుట్ర లు చేస్తున్నా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పడుతుం దంటే అది సోనియాగాంధీ దయతోనేనన్నారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లుపెట్టే సమయంలో తాను ఎవరిపై దాడి చేయలేదని చెప్పారు. మతిచలించిన విజయవాడ ఎంపీ లగడపాటి బిల్లును అడ్డుకోవడానికి పెప్పర్ స్ప్రే దాడి చేస్తూ అరాచకానికి పాల్పడుతుంటే.. తాము అడ్డుకున్నామన్నారు. సోనియాగాంధీ కుటుంబానికి ప్రధాని పదవిపై మోజు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement