కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే సీఎం: మధుయాష్కీ | kiran kumar reddy is only the chief minister of seemandhra, says madhu yashki | Sakshi
Sakshi News home page

కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే సీఎం: మధుయాష్కీ

Sep 15 2013 11:00 PM | Updated on Jul 29 2019 5:31 PM

కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే సీఎం: మధుయాష్కీ - Sakshi

కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే సీఎం: మధుయాష్కీ

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే ముఖ్యమంత్రి అని, తెలంగాణకు కాదని ఎంపీ మధుయాష్కీ అన్నారు.

యాదగిరికొండ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్రకే ముఖ్యమంత్రి అని, తెలంగాణకు కాదని ఎంపీ మధుయాష్కీ అన్నారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం జరిగిన శాంతిర్యాలీలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్ర నాయకులు ఎంత మంది వెన్నుపోటు పొడిచినా.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సీమాంధ్ర నేలత పదవులు సోనియా పెట్టిన భిక్ష అన్నారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర నేతలు ఆ పదవులకు అర్హులు కాదని అన్నారు. అగ్రకులాల వారంతా కలిసి తెలంగాణను అడ్డుకుంటున్నారని విమర్శించారు.

 

ఎంతమంది ఎన్ని అడ్డుంకులు కల్పించినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆగదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే ఈ తరుణంలో ఎవరూ ఆవేశాలకు లోనూ కావద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమైక్యాధ్ర సభకు ప్రధాన పాత్రధారి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డేనని, సభకు అయిన ఖర్చంతా ఆయనే భరించారని అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం 40 రోజులు కాదు 4 సంవత్సరాలు నడిచినా కేంద్ర నాయకత్వం తెలంగాణా ఇచ్చి తీరుతుందని అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని పడగొడతామన్నా, రాష్ట్రపతి పాలన వస్తుందని బెదిరించినా కేంద్రం వద్ద ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement