గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు

Key Points To Grama And Ward Sachivalayam Aspirants In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు మరో వారం మాత్రమే ఉండటంతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ విజయ్ కుమార్‌ అభ్యర్థులకు పలు కీలకమైన సూచనలు చేశారు. పరీక్ష రాసే గంట ముందే అభ్యర్ధులు ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ‘సాక్షి’ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు.
(చదవండి : సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు)

పరీక్షహాల్లోకి సెల్‌ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించేది లేదని విజయ్ కుమార్‌ స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని చెప్పారు. మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, దళారీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల 478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, దాదాపు 22 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు కూడళ్లలో, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేయనున్నామని విజయ్ కుమార్‌ తెలిపారు. 

అభ్యర్థులు తెలుసుకోవాల్సినవి..

 • సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు
 • సెప్టెంబర్‌ 1వ తేదీ ఉదయం పరీక్ష రాయనున్న 12.5 లక్షల మంది
 • సెప్టెంబర్‌ 1వ తేదీ మధ్యాహ్నం పరీక్ష రాయనున్న 3 లక్షలమంది
 • ఉదయం 10గంటల నుంచి 12:30 వరకు పరీక్ష
 • మధ్యాహ్నం 2:30 నుంచి 5గంటల వరకు పరీక్ష
 • ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
 • 150ప్రశ్నలకు..  150 మార్కులు
 • పరీక్షల్లో నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది
 • నాలుగు తప్పులకు ఒక మార్కు పోతుంది
 • రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం
 • టెక్నికల్‌ పేపర్‌ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది
 • గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
 • నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ
 • హాల్‌టికెట్‌, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి
 • పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు
 • కూడళ్లు, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు, హెల్ప్‌డెస్క్‌లు
 • మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటాం
 • పరీక్షా కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top