
ప్రతీకాత్మక చిత్రం
పశ్చిమగోదావరి జిల్లా (నిడమర్రు): నిడమర్రు మండల జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి మైలవరపు సురేంద్ర జూదం కేసులో అరెస్ట్ అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బావాయిపాలెం గ్రామ శివారు చేపల చెరువు షెడ్ వద్ద పేకాట ఆడుతున్న 10 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు నిడమర్రు ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. వీరి నుంచి రూ.79,200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో నిడమర్రు జనసేన జెడ్పీటీసీ అభ్యర్థి మైలవరపు సురేంద్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.