జనసేన కార్యకర్తల అరాచకం

Janasena Activist Destroyed YSRCP Ganesh Chaturthi Flexi In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : వీరవాసరంలో జనసేన కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారు. వీరవాసరంలో వినాయకచవితి సందర్భంగా గ్రామానికి చెందిన నూకల కనకారావు, మద్దాల సత్యనారాయణమూర్తి, నూకల కిరణ్, కందుల సురేష్‌ తదితరులు భీమవరం ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తదితరులతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీరవాసరం ఎస్‌బీహెచ్‌ సమీపంలో ఉన్న ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు బ్లేడ్లతో కోసి ధ్వంసం చేశారు. ఎన్నికల సమయంలోనూ జనసేన కార్యకర్తలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు.

పవన్‌  కల్యాణ్‌ పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకుని మోటార్‌ సైకిళ్ల సైలెన్సర్లు తీసి గట్టిగా కేకలు వేస్తూ, మనుషులపైకి దూసుకెళ్తూ ర్యాలీలు నిర్వహించారు. జన సైనికులు,  కార్యకర్తలు చేస్తున్న ధ్వనికాలుష్యం, ఫ్లెక్సీ ధ్వంసం వంటి కార్యక్రమాలపై మండల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీని బ్లేడ్లతో కోసి ధ్వంసం చేయడంపై మండల వైఎస్సార్‌సీపీ శ్రేణులు వీరవాసరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. బాధ్యులను గుర్తించి విచారణ చేపడతామని వీరవాసరం ఎస్సై బి.మహేశ్వరరావు తెలిపారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top