ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం | Jaleel Khan Attacked YSRCP Office In Vijayawada | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం

Apr 11 2019 7:21 PM | Updated on Apr 12 2019 4:30 AM

Jaleel Khan Attacked YSRCP Office In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : నేడు ఏపీలో జరిగిన పోలింగ్‌లో కొన్నిచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడి పలుచోట్ల దాడులకు దిగింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ హల్‌చల్‌ చేశారు. వన్ టౌన్‌ పరిధిలో తన అనుచరులతో కలిసి జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు.  

వైఎస్సార్‌సీపీ డివిజన్ అధ్యక్షుడు వాహబ్ కార్యాలయంపై ఆయన తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వాహబ్‌కు చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్యాలయంలోని ఫర్నిచర్‌ని ధ్వంసం చేశారు. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేస్తావా అంటూ పంజా సెంటర్‌లో రెచ్చిపోయారు. ఈ దాడితో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసుల పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం జలీల్‌ ఖాన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆయన్ను కేశినేని నాని పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement