‘ప్రజల్లోనే ఉండండి.. వారి సమస్యలపై పోరాడండి.. సమైక్య ఉద్యమంలో మమేకమై ముందుండి పనిచేయండి’
ప్రజల్లోనే ఉండండి.. సమస్యలపై పోరాడండి..
Sep 27 2013 3:20 AM | Updated on Oct 2 2018 6:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ప్రజల్లోనే ఉండండి.. వారి సమస్యలపై పోరాడండి.. సమైక్య ఉద్యమంలో మమేకమై ముందుండి పనిచేయండి’ అని జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులను పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ క్యాంపు కార్యాలయంలో బుధ, గురువారాల్లో జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని రాజకీయ పరిణామాల గురించి జగన్‌మోహన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు.
నిత్యం జనం మధ్యనే ఉండాలని, వారికి ఎటువంటి సమస్య వచ్చినా తగిన విధంగా స్పందించాలని ఆదేశించారు. తనను కలిసిన నియోజకవర్గ సమన్వయకర్తలతో ప్రత్యేకంగా మాట్లాడుతూ పార్టీ ఎలా చేయాలనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం కలిసిన వారిలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ కణితి విశ్వనాథం, స్థానిక నాయకుడు డాక్టర్ డి.జీవితేశ్వరరావు, ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, ఇచ్ఛాపురం తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, ఆయన భార్య విజయ, రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, జిల్లా యువజన విభాగం కన్వీనర్ హనుమంతు కిరణ్‌కుమార్, పాతపట్నం నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి, వైఎస్‌ఆర్ టీఎఫ్ జిల్లా కన్వీనర్ కె.వి.సత్యనారాయణ, టెక్కలి స్థానిక నాయకులు బగాది రామకృష్ణ, చిలకా దేవానంద్ ఉన్నారు.
కాగా బుధవారం జగన్‌మోహన్‌రెడ్డిని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ కృష్ణదాస్, మాజీ మంత్రి, పార్టీ నేత తమ్మినేని సీతారాం, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం, పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్తలు పాలవలస విక్రాంత్, విశ్వాసరాయి కళావతి, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వై.వి.సూర్యనారాయణ, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు కలిశారు.
Advertisement
Advertisement