న్యాయవాదుల జేఏసీ సదస్సుకు వితరణ | JAC lawyers and Distribution Conference | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల జేఏసీ సదస్సుకు వితరణ

Nov 16 2013 2:23 AM | Updated on Sep 2 2017 12:38 AM

సమైక్యాంధ్ర సాధన కోసం న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన స్థానిక కేఎస్‌ఆర్ కల్యాణమండపంలో జరిగే సదస్సుకు సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి వితరణ ఇచ్చారు.

కడప రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసం న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీన స్థానిక కేఎస్‌ఆర్ కల్యాణమండపంలో జరిగే సదస్సుకు సమైక్యాంధ్ర జేఏసీ జిల్లా కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి వితరణ ఇచ్చారు. సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు ఎదుట దీక్షలు చేపడుతున్న శిబిరాన్ని శుక్రవారం సింగారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈనెల 24వ తేది కడప కేఎస్‌ఆర్ కల్యాణ మండపంలో జరిగే సీమాంధ్ర న్యాయవాదుల సదస్సుకు రూ.10వేలు విరాళాన్ని కడప బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డికి అందజేశారు.
 
 విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి న్యాయవాదులు పెద్ద ఎత్తున సమైక్యాంధ్ర కోసం పోరాడుతూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని ప్రశంసించారు. తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్ర కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర కోసం ఈనెల 24వ తేదిన సీమాంధ్ర న్యాయవాదులు నిర్వహించే సదస్సు జయప్రదం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాదుల జేఏసీ నాయకులుపాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement