దిల్రాజు కార్యాలయంపై ఐటి అధికారుల దాడి | IT officers attack on Dil Raju Office | Sakshi
Sakshi News home page

దిల్రాజు కార్యాలయంపై ఐటి అధికారుల దాడి

Jan 11 2014 7:41 PM | Updated on Sep 27 2018 4:47 PM

సినీ నిర్మాత దిల్ రాజు - Sakshi

సినీ నిర్మాత దిల్ రాజు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయంపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడి చేశారు.

హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత  దిల్ రాజు కార్యాలయంపై  ఇన్కమ్ టాక్స్(ఐటి) అధికారులు దాడి చేశారు. కార్యాలయం లోపల వారు సోదాలు చేస్తున్నారు. పైడిపల్లి వంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్, శ్రుతిహాసన్ జంటగా, అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రలో  నటించిన 'ఎవడు' చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఆ చిత్రం రేపు విడుదల కానుంది.

 సుకుమార్ దర్శకత్వంలో ప్రిన్స్‌ మహేష్‌బాబు హీరోగా, క్రితి సానన్ హీరోయిన్గా  '1 నేనొక్కడినే' చిత్రాన్ని నిర్మించిన  14 రీల్స్ సినిమా నిర్మాణ సంస్థపైన కూడా ఆ చిత్రం విడుదలకు ముందు ఐటి అధికారులు దాడి చేసి, సోదాలు చేశారు.  ఈ రకమైన దాడుల వల్ల భారీ చిత్రాలు నిర్మించిన నిర్మాతలు భయపడే పరిస్థితులు నెలకొంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement