శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ ట్రక్ బిల్డింగ్ యూనిట్ | Isuzu Motors Truck Building Unit in sri city | Sakshi
Sakshi News home page

శ్రీసిటీలో ఇసుజు మోటార్స్ ట్రక్ బిల్డింగ్ యూనిట్

Nov 28 2014 1:17 AM | Updated on Jul 28 2018 6:33 PM

చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు మోటార్స్ కంపెనీ తరపున ట్రక్ బిల్డింగ్ పరిశ్రమ నెలకొల్పేందుకు..

చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు మోటార్స్ కంపెనీ తరపున ట్రక్ బిల్డింగ్ పరిశ్రమ నెలకొల్పేందుకు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మసనోరి కటయామా సంసిద్ధత వ్యక్తంచేశారు. చంద్రబాబు ఇసుజు మోటార్స్ సంస్థను సందర్శించారు. ప్రస్తుతం భారతదేశంలో ఇసుజు మోటార్స్ కార్యకలాపాలు అంత గొప్పగా లేకపోయినా మేకిన్ ఆంధ్రప్రదేశ్‌లో తాము భాగస్వాములవుతామని కటయామా ప్రకటించారు.

భారతదేశం నుంచి జపనీయులు బుద్ధిజాన్ని స్వీకరిస్తే, జపాన్ నుంచి తాము పని సంస్కృతిని అలవర్చుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మెగా ఫుడ్ పార్కులకు అవసరమైన కోల్డ్ చెయిన్లను రూపొందించేందుకు మయేవక మాన్యుఫాక్చరింగ్ కంపెనీ చైర్మన్ యోషిరో తనాకా ఆసక్తి ప్రదర్శించారు. మయేవక మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ప్రతినిధులతో కూడా ఏపీ ప్రభుత్వ బృందం భేటీ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement