ఆడపిల్లే ఇంటి వెలుగు | International Girls Child Day Special Story | Sakshi
Sakshi News home page

ఆడపిల్లే ఇంటి వెలుగు

Jan 24 2020 12:53 PM | Updated on Jan 24 2020 12:53 PM

International Girls Child Day Special Story - Sakshi

ఒంటరి బాలిక, మహిళల కోసం ఏర్పాటు చేసిన శిశు గృహ

ఒంగోలు వన్‌టౌన్‌: జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కందుకూరు డివిజన్‌ పరిధిలో ఆర్థిక స్తోమత లేక, బాలికలను చదివించలేక కొందరు తల్లిదండ్రులు వారికి బాల్య వివాహాలు చేసేందుకు  మొగ్గు చూపుతున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ తంతు జిల్లాలో ఏదో ఒక చోట జరుగుతూనే ఉంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పించినా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. అధికారులు 2015 సంవత్సరంలో 104 మందిని బాల్య వివాహాలు నుంచి రక్షించారు 2016లో 98, 2017లో 112, 2018లో 96, 2019లో 64 మందిని బాల్య వివాహాలు కాకుండా ఆధికారులు కాపాడారు.

నిష్పత్తిలో వ్యత్యాసం...
2011 భారతదేశం లెక్కల ప్రకారం 0–6 సంవత్సరాల బాలల లింగ నిష్పత్తి 918 గా నమోదు కాబడింది. కాని బాల బాలికల లింగ నిష్పత్తిని పరిశీలిస్తే బాలికల యొక్క జననాన్ని పిండ దశలో గుర్తించి పిండాన్ని విచ్ఛిన్నం చేయడం లేదా బాలికలు జన్మించిన తరువాత లింగ వివక్షత వలన వారిని చంపడం జరుగుతుంది. దేశ జనభాతో పాటు మన ప్రకాశం జిల్లా జనాభాలో బాల, బాలికల లింగ నిష్పత్తి  పరీశీలించినట్లయితే 1000 మంది బాలురకు 981 మంది బాలికలుగా నమోదు కాబడినది. రాచర్ల 851, టంగుటూరు 892 మండలాల్లో నమోదు అయింది.

వైఎస్సార్‌  కిషోరి వికాసం...
మహిళాభివృది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ కిషోరి వికాసం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో బాగంగా సీ.డీ.పీ.ఓలు, సూపర్‌వైజర్లుతో పట్టణ, మండల, గ్రామ స్థాయిలో 1తరగతి నుంచి 6వ తరగతి చదివే బాలికలకు ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బాలికల ఆరోగ్యం, వ్యక్తిగత శుభ్రత, పోషకాహరం, చట్టాలగురించి తేలియచేయడం, బయట వ్యక్తుల దగ్గర నుంచి మంచి స్పర్శ, చెడు స్పర్శ ఏ విధంగా ఉంటుంది ఎలా గుర్తించటం, పాఠశాలల్లో ఏవిధంగా ఉండాలి, లైంగిక దాడులు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ఆవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కఠిన చట్టాలు....
మహిళలు, బాలికలపై అత్యాచారాలు హత్యలు చేస్తున్నవారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చట్టాలు ప్రవేశ పెట్టింది దేశంలో ఎక్కడ లేని విధంగా దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. అత్యాచారాల బాధితుల కోసం దిశ వైద్య కేంద్రం, దిశ పోలీస్‌ స్టేషన్, ప్రత్యేకంగా ఎర్పాటు చేస్తోంది. అత్యాచారాలకు గురైన భాదితులకు అండగా ఆర్థిక సహాయం అందించటం దిశ వైద్య కేంద్రంలోనే  ఫిర్యాదు నమోదు చేయటం, న్యాయ సలహాలు అంధించటం నిందితులకు 21 రోజుల్లో శిక్ష పడలే చేయటం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో  ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. రాష్ట్రంలో దేశంలో కఠినమైన చట్టాలు ఉంటేనే మహిళలపై అత్యాచారాలు, హత్యలు తగ్గుతాయని మహిళలు తేలియజేస్తున్నారు.

చదువుకు చేయూత.....
ఆర్థిక స్థోమతతో తల్లిదండ్రులు ఆడ పిల్లల చదువును మధ్యలో మాన్పించి బాల్య వివాహాలకు పూనుకుంటున్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల్లోని బాలికలకు రాష్ట ప్రభుత్వం చదువులకు ఫీజ్‌ రియంబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తోంది. దీంతో తల్లిదండ్రులు కుడా బాలికలను ఉన్నత చుదువులు చదివించేందుకు మొగ్గు చుపుతున్నారు. కిశోరీ బాలికలు స్వయం శక్తివంతులుగా తీర్చిదిద్దడానికి ప్రధానమైన ఆయుధం విద్య. కిషోరి బాలికలు సాంకేతిక, వృత్తి విద్యాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ప్రత్యేక శిక్షణను ఆందిస్తుంది తమ జీవితాన్ని తాము ముందుకు తీసుకెళ్లేలా వృత్తి విద్యా,జీవన నైపుణ్యం ఆత్మవిశ్వాసం పెంచుకునే విధంగా తయారవ్వాలి

బాలికలు ఉన్నత చదువులు చదువుకోవాలి...
ఆడపిల్లలకు మగ పిల్లలతో సమానంగా చూడడం, వారు చుదువుకునేందుకు తల్లిదండ్రులతో పాటు సమాజము వారికి ప్రోత్సాహం ఆందించాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రక్షణ ఇచ్చే దిశగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. బాలికలు మహిళల పట్ల పురుషులు  ఏవిధంగా ప్రవర్తించాలి, చట్టాలపై ఆవగాహన కల్పించాలి. గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. బాలికలు విపత్కర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలి అన్నది బాలికలు తెలుసుకోవాలి. టోల్‌ ఫ్రీ నం చైల్డ్‌లైన్‌ 1098 ఉమెన్‌ హైల్ప్‌లైన్‌181 పోలీస్‌ 100. 112 ఆత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు ఫోన్‌ చేయాలి.– విశాలక్షి, మహిళ అభివృద్ధి్ద, స్త్రీ శిశు సంక్షేమశాఖ, పాజెక్టు డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement