ఐబీ తప్పుడు నివేదిక పంపే అవకాశం: దామోదర్ రెడ్డి | Intelligence Bureau may send manipulated reports: Ramreddy Damodar Reddy | Sakshi
Sakshi News home page

ఐబీ తప్పుడు నివేదిక పంపే అవకాశం: దామోదర్ రెడ్డి

Nov 25 2013 1:57 PM | Updated on Sep 2 2017 12:58 AM

ఐబీ తప్పుడు నివేదిక పంపే అవకాశం:  దామోదర్ రెడ్డి

ఐబీ తప్పుడు నివేదిక పంపే అవకాశం: దామోదర్ రెడ్డి

రాయల తెలంగాణ అంశంపై కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు .....పార్టీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవడం సరైంది కాదని కాంగ్రెస్ ఎమ్యెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ : రాయల తెలంగాణ అంశంపై కేంద్ర  ఇంటెలిజెన్స్ అధికారులు .....పార్టీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకోవడం సరైంది కాదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్యెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ...  ఇది తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నమేనన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలంతా మొదటినుంచి పది జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్రాన్నే కోరుతున్నట్టు ఆయన తెలిపారు.

ఇంటెలిజెన్స్ అధికారులు కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపే అవకాశం ఉందని దామోదర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ అంశాన్ని హైకమాండ్ గేమ్ ప్లాన్లో భాగమని అనుకోవటం లేదన్నారు. అదే అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతోపాటు, కేంద్ర కేబినెట్ నిర్ణయంలోనూ రాయల తెలంగాణ ప్రస్తావన  ఎందుకు ఉందని ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అంశంతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేల సంఖ్యను పెంచాలని జీవోఎంను కోరేందుకు ఢిల్లీ వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement